నా బిడ్డను విడిచిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా

మందస : తన బిడ్డను జైటు నుంచి విడిచి పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మావోయిస్టు నేత దున్న కేశవరావు ఆలియాస్‌ ఆజాద్‌ తల్లి కాములమ్మ తెలిపింది. అజ్ఞాత వాసంలోని తన బిడ్డను జనజీవన స్రవంతిలో కలిసిపోతే కేసులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం తీరా అతను లొంగిపోయాక కుట్రపన్ని ఒరిస్సా పోలీసులకు అప్పజెప్పిందని ఆరోపించింది. తప్పుడు కేసులు బనాయించి తన బిడ్డను జైల్లో చిత్రహింసటు పెడుతున్నదుకు నిరసిస్తూ కేశవరావు ఈనెల నాలుగో తేదీ నుంచి జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్నాడు. తన కుమారుడు మృతి చెందక ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని కంటతడి పెడుతూ చెప్పింది. పలాస ఎమ్మెల్యే జుట్టు జగన్నాయకులు ద్వారా ముఖ్యమంత్రికి కేశవరావు రాసిన లేఖను పంపినట్లు తెలిపింది.