Thursday, 5 November 2026

నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా : కేటీఆర్

KTR say sorry to Assembly

హైదరాబాద్ : శాసనసభలో ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మొదట డీకే అరుణ క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ ఆమె చెప్పలేదు. సీఎం కేసీఆర్ మొదట తమ మంత్రే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారు.. తర్వాత మీరు క్షమాపణ చెప్పండి అని సూచించారు. ఎవరు ముందు చెబితే ఏముంది.. ఇలాంటి బేషజాలకు పోకూడదని సీఎం చెప్పారు. డీకే అరుణను ఉద్దేశించి బంగ్లా రాజకీయాలు చేయొద్దని.. ఇది శాసనసభ అని కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *