Wednesday, 4 November 2026

‘నా వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది’

హైదరాబాద్‌: ‘ నిన్న నేను జహిరాబాద్‌ సభలో చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది.’ అని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తన మాటలను వక్రీకరించిన పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ విషయంపై తాము మంత్రి గీతారెడ్డిని కలిసి వివరణ ఇస్తామని  కోదండరాం వెల్లడించారు. జేఏసీ అంబేద్కర్‌ స్ఫూర్తితో పనిచేస్తుందని దళత సంఘాలు గుర్తించాలని ఆయన కోరారు. నిన్న జహిరాబాద్‌లో జరిగిన ఘటనపై ఇప్పటికే జేఏసీ నేతలు మంత్రి గీతారెడ్డికి ఫోన్‌లో మాట్లాడి విపరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *