Wednesday, 4 November 2026

నిందితులకు రాజీ మార్గమే రాజ మార్గం

నిందితులకు రాజీ మార్గమే రాజ మార్గం హుజూర్ నగర్ నవంబర్ 12 (జనం సాక్షి): క్షణికావేశంలో కేసులపాలై సంవత్సరాలు తరబడి న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్న నిందితులకు రాజీమార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ అన్నారు. శనివారం న్యాయస్థాన ప్రాంగణంలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో ఆయన కక్షిధారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలతో లో కేసులను రాజీ చేసుకోవడం మూలంగా సమయము, డబ్బు ఆదా అవుతుందనీ అలాగే లోక్ అధాలత్ లో జారీ కాబడిన అవార్డును అప్పీల్ రూపంలో ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు అన్నారు. కక్షిదారులంతా తమ కేసులను రాజి చేసుకుని ప్రశాంత జీవనం గడపాలని కోరారు. కాగా ఈ లోక్ అదాలతో 11 క్రిమినల్ కేసులు, ఏడు సివిల్ దావాలు రాజీ అయ్యాయి. 800 కేసులలో కక్షిదారులు 9 లక్షల 50 వేల రూపాయలను జరిమానా రూపంలో చెల్లించారు. బ్యాంకు దావాలకు సంబంధించి కక్షిదారులు 40 వేల రూపాయలను బ్యాంకులకు చెల్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర, లోక్ అదాలత్ సభ్యులు కుక్కడపు బాలకృష్ణ, జుట్టు కొండ సత్యనారాయణ, కుక్కడపు నరసింహారావు, ఎం,ఎస్. రాఘవరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, రవికుమార్, కృష్ణయ్య, చనగాని యాదగిరి, బట్టిపల్లి ప్రవీణ్, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, వెంకయ్య, సురేష్, సైదా హుస్సేన్, శంకర్, సురేష్, వెంకటేష్, శ్రీను నాయక్, క్రాంతి, ప్రదీప్తి తదితరులు పాల్గొన్నారు.