దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు
• రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్దవంగర నవంబర్ 12(జనం సాక్షి )ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన దళిత బంధు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. మండలంలోని అర్హత కలిగిన దళితులందరికీ విడుదలవారీగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, నెహ్రూ నాయక్, పాలకుర్తి యాదగిరిరావు, ముత్తినేని శ్రీనివాస్, శ్రీరాం సుధీర్, శ్రీరాం సంజయ్, ఎంపీటీసీ ఫోరం మండల కన్వీనర్ శ్రీనివాస్, సర్పంచ్ చింతల భాస్కర్, నాయకులు వెంకటయ్య, ఉపేందర్, రాము, లింగమూర్తి, రవి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




