హైదరాబాద్: నగరంలోని నిజాంపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 7 లక్షల నగదును, ఓ కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.




