హైదరాబాద్: నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెరాస నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రవేటీకరించడం కుంభకోణమేనని సభాసంఘమే తేల్చి చెప్పిందని ఆయన అన్నారు. రూ. 2 వేల కోట్ల ఇంధన నర్‌ఛార్జీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని .. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.




