Tuesday, 3 November 2026

నిజాయితిని చాటుకున్న హోమ్ గార్డ్

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 2 (జనం సాక్షి) సోమవారం రాత్రి 08:00 గంటల సమయంలో కొత్తగూడెంకు చెందిన జోగు సందీప్ అను వ్యక్తి తన మోటార్ సైకిల్ మీద వరంగల్ రైల్వే స్టేషన్ నుండి హన్మకొండ బస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలోపోచమ్మ మైదానం దగ్గర తన వివో సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు,వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ ప్రతాప్  పోగొట్టుకున్న సదరు వ్యక్తి వివరాలు తెలుసుకొని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ చేతుల మీదుగా అట్టి సెల్ ఫోన్ ను అప్పచెప్పడం జరిగింది.. నిజాయితీని చాటుకున్న హోమ్ గార్డ్ ప్రతాప్ ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్  అభినందించడం జరిగింది.