Wednesday, 4 November 2026

నిజాయితీకి నిలువెత్తు రూపం ఉపాధ్యాయలు

గంగారం జూన్ 16 (జనం సాక్షి)
గంగారం మండలం ఇసుకమేధి గ్రామానికి చెందిన పొడుగు వెంకన్న 15000 రూ.విలువగల సెల్ఫోన్ నర్సి గూడెం, కాటినాగారం గ్రామాల మధ్య రోడ్డు పై పోగొట్టుకున్నాడు డ్యూటీ లో భాగంగా జడ్పీహెచ్ఎస్ కోమట్లగూడెం స్కూల్ కి చెందిన దేవరాజు మల్లేశం అనే ఉపాధ్యాయుడు బైక్ పై వస్తుండగా దొరికింది. అడ్రస్ తెలుసుకొని ఆ సెల్ ఫోన్ ను తిరిగి ఇవ్వడంతో పొడుగు వెంకన్న చాలా సంతోషించాడు. సెల్ఫోన్ పోగొట్టుకుంటే ఎంత బా ధపడతారో మనందరికీ తెలుసు.ఫోన్ పోయిన బాధకన్నా అందులోని సమాచారం ముఖ్యమైనదని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆ టీచర్ ని ని అభినందించారు. టీచర్ అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలని నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరాస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.