Monday, 2 November 2026

నితిన్ గడ్కరీతో కేసీఆర్ భేటీ

 కేంద్ర ఉపరితల రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి kcr-meets-nithin-gadkariసమావేశమయ్యారు. జాతీయ రహదారుల అభివృద్ధి, డ్రైపోర్ట్ తదితర అంశాలపై చర్చించారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో రాష్ర్ట మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి రహదారి విస్తరణకు రక్షణ శాఖ భూములు కోరామని తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రాష్ర్టంలోని 4 మార్గాలను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని గడ్కరీని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రకటించిన జాతీయ రహదారులకు ఆమోదం తెలపాలని కోరామన్నారు. తెలంగాణలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చేపట్టే భూసేకరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. భూసేకరణ అనంతరం కేంద్రానికి నివేదిక అందిస్తే నాలుగులైన్ల రహదారి విస్తరించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి చెప్పారని తెలిపారు. గడ్కరీ అన్ని విషయాల్లోనూ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *