Wednesday, 4 November 2026

నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులుయాసిడ్ తో దాడి

భైంసా రూరల్ జూన్13 జనం సాక్షినిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తారోడ గ్రామంలో నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి…నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తారోడ గ్రామనికి చెందిన గడపాలే మోహన్ బంగ్లాపైన నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి యాసిడ్ తో దాడిచేసాడు. దింతో మోహన్ అరవడంతో కుటుంబీకులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చి మోహన్ ను హుటాహుటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై యాసిడ్ పడడంతో మొఖంతో పాటు శరీరంలో కొంత భాగం కాలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.