Wednesday, 4 November 2026

ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి -కార్పొరేట్ & ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి

 

 

హన్మకొండ ప్రతినిది జూన్ 13 జనంసాక్షిజీవో నెంబర్ 1,42,91 లను పూర్తిస్థాయిలో అమలుపరిచి,
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల,యాజమాన్యాల ఫీజుల దోపిడీని అరికట్టాలని,ఫీజులను నోటీస్ బోర్డులో పొందుపరచాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్ ) హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన స్థానిక ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులను అక్రమంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యను దుకాణాల్లో సరుకుల్లాగా కేజీల ప్రకారం అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు.అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల పైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు.విద్యా హక్కు చట్టాన్ని తుంగలోకి తొక్కి పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ తదితర స్టడీ మెటీరియల్ అంతా ఆయా పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని,బయట కొనుగోలు చేసిన పుస్తకాలు మా పాఠశాలలో ఉపయోగపడని,రూ.15 వేల నుండి రూ.20వేలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు 25 శాతం ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు అన్నారు అసత్య ప్రచారాలతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్ చేయించుకుంటున్నారని ఆరోపించారువిద్యాసంస్థలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో కచ్చితంగా జీవో నెంబర్1,42’91 లను పాటించాలన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూన్ 20 నుంచి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సందర్శిస్తామని నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దయ్యేంతవరకు
పోరాటం చేస్తాము అని హెచ్చరించారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్ర మత్తు వదిలి ప్రభుత్వ నిబంధనలను అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిని రవితేజ మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.