Tuesday, 3 November 2026

నిమ్మల సైదులు పార్థివ దేహానికి పూలమాల వేసి

నిమ్మల సైదులు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు హుజూర్ నగర్ డిసెంబర్ 1 (జనం సాక్షి): హుజుర్ నగర్ పట్టణ పరిధిలోని మాధవరాయినిగూడెం 28 వ వార్డు టి.ఆర్.ఎస్ పట్టణ బి.సి కమిటి ఉపాధ్యక్షులు నిమ్మల వెంకటేశ్వర్లు తండ్రి నిమ్మల సైదులు అకాలమరణం పట్ల చింతిస్తూ టి.ఆర్.ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టె రామయ్య, 28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు , 9 వ వార్డు ఇంచార్జ్ మధు లు వారి పార్థివ దేహానికి గురువారం పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖా అధ్యక్షులు అవుల గురవయ్య, నందిగామ శంభయ్య, నందిగామ ముక్కంటి, విజయ్, అంజయ్య, మేకల సైదయ్య తదితరులు పాల్గొన్నారు.