ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలి.
_అచ్చంపేట బిజెపి ఇన్చార్జి సతీష్ మాదిగ.
జనం సాక్షి పదర: ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని అచ్చంపేట బిజెపి ఇన్చార్జి సతీష్ మాదిగ కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో రైలు గండి ఆవరణంలో బిజెపి కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశాన్ని అధ్యక్షన మండల అధ్యక్షులు కొయ్యల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బుధవారం నాడు ముఖ్యఅతిథిగా సతీష్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాబోయే ఎన్నికలకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేసే అచ్చంపేట నియోజకవర్గం లో కాశ్యం జెండా ఎగురవేయాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండికారి బాలాజీ, రామోజీ, రేనయ్య, రవి ముదిరాజ్, రాము యాదవ్, రాజు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలి.




