Wednesday, 4 November 2026

నియంత పాలనకు చరమ గీతం పాడదాం

రాజోలి 14 జులై (జనం సాక్షి)
–మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
—-ఆరవరోజున రాజోలి మండలంలో మొదలైన పాదయాత్ర
రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. స్వతంత్ర గౌరవ పాదయాత్ర లో భాగంగా ఆరవరోజున రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో ఆయన పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్దులకు పింఛన్లు ఇవ్వకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా, పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా ప్రతి రోజు అసత్యాలు పలుకుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా విఫలమయ్యారని వారి కుటుంబానికి మాత్రం పదవులు, నిధులు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే లు ఆట బొమ్మలు అయ్యారని కనీసం ప్రజలు చెప్పే సమస్యలు పట్టించుకోకుండా, వారి రాజకీయ భవిష్యత్తు గురుంచి ఆలోచిస్తూ, కమీషన్లు కాసులకు కక్కుర్తి పడుతున్నారని మండి పడ్డారు. సంక్షేమ పథకాలు ఆటకెక్కయని, ఉద్యోగుల లకు జీతాలు ఇవ్వలేక ధనిక రాష్ట్రమని దరిద్రంలోకి నెడుతున్న చేతకాని ప్రభుత్వం టీఆర్ఎస్ అని , ప్రజల ఉసురు పోసుకుని పార్టీ, ఆ పార్టీ నాయకులు డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో ఋణమాఫి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సంవత్సరం లో 5 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆదివారం రోజు ఆయన పాదయాత్ర పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ,నసనూర్, మాన్ దొడ్డి, తుమ్మిళ్ల గ్రామాల్లో కొనసాగింది.ఆయన తో పాటు ఆయన సతీమణి మహా లక్ష్మి పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి షేక్ షావళి ఆచారి,జనార్దన్ ,దేవ సహాయం, కుమార్, అమృత రాజు,యం. రాజు సుందరాజ్,వీరన్న గౌడ్,తిమ్మప్ప బాబురావ్,కిషోర్, దస్తగిరి,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు