Wednesday, 4 November 2026

నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించండి”

 

 

 

 

 

 

భైంసా రూరల్ ఫిబ్రవరి 12 జనం సాక్షి-గౌరవ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు పలువురు మంత్రులను కలిసి విన్నవించిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి*ముధోల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధికి విరివిగా నిధులు కేటాయించాలని గౌరవ సీఎం కేసీఆర్ గారిని, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు సంబంధిత మంత్రులను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కలిసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు విన్నవించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు . ఇందులో ముఖ్యంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రం లో మినీ స్టేడియం, పల్లె దావాఖనా తో పాటు వివిధ అభివృద్ధి పనులకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని విన్నవించారు . భైంసా పట్టణంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేందుకు , రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తట్టుకునేందుకు ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భైంసా పట్టణం నానాటికి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో అవసరం ఉన్న చోట పల్లె దవాఖానాలు, ఫైర్ స్టేషన్లు , వెటర్నరీ ఆసుపత్రులు, మరియు గ్రామ పంచయతీల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో నూతనంగా మూడు సబ్ స్టేషన్ లు మంజూరు అయ్యాయని మరొకటి అదనంగా మంజూరు చేయాలని కోరారు. అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం ఇదివరకే భారీగా నిధులు కేటాయించిందని ,ఇంకా మిగిలి ఉన్న సిసి రోడ్లు డ్రైనేజీల పనులకు నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో పలుచోట్ల షాదిఖానాలు పనులు కొనసాగుతున్నాయని వాటికి నిధులు విడుదల చేయాలని కోరారు.. ఎమ్మెల్యే గారి విన్నపంపై సంబంధిత శాఖ మంత్రులు సానుకూలంగా స్పందించారు . ముధోల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ,అలాగే సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గం లో ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనులను సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యే గారు వివరించారు. కేసీఆర్ గారి హయాంలోనే ముధోల్ నియోజక వర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరయ్యాయని అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి , తండాకి చేరాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు నియోజకవర్గం లో ఎక్కువ మొత్తంలో దేవాలయాలకు నిధులు మంజూరు చేశారన్నారు. అలాగే నియోజకవర్గంలో పెండిగ్ లో ఉన్న షాదీ ముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం రూపాయలు రెండు కోట్ల డెబ్బై లక్షలు నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే సంబంధిత లబ్ధిదారులకు చెక్కులుఅందిస్తామన్నారు.