Tuesday, 3 November 2026

నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని

నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
హుజూర్ నగర్ జనవరి 01 (జనం సాక్షి): నూతన సంవత్సరం సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని హుజూర్ నగర్ లోని వినాయక స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, బీఆర్ఎస్ నాయకులు కడియాల రామకృష్ణ, సోమగాని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.