Tuesday, 3 November 2026

మంత్రి జగదీశ్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు

మంత్రి జగదీశ్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు
మిర్యాలగూడ, జనం సాక్షి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ జగదీష్ రెడ్డికి రాష్ట్ర ఆగ్రో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా రైతుబంధు అద్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షులు కర్ణాటక రమేష్ లు ఆదివారం నాడు సూర్యాపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మిర్యాల గూడ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గౌరు శ్రీనివాస్, రంగా లింగయ్య, రేపాల మధు,వెంకటరమణ చౌదరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు మదర్ బాబా, మండల రైతు బంధు అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు తదితరులు ఉన్నారు.