నిరవధిక సమ్మె
కడెం జూలై 24(జనం సాక్షి ) ముఖ్యమంత్రి మార్చి2022 రోజున నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు VRA లకు పే స్కేల్, అర్హత కలిగిన VRA లకు ప్రమోషన్ లు మరియు 55సం.రాలు వయస్సు పైబడిన VRA ల వారసులకు ఉద్యోగం కల్పిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ రెండేండ్లు గడుస్తున్న అమలుకాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా VRA JAC పిలుపు మేరకు రాష్ట్రం లోని అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు ఈ నెల 25-07-2022 నుండి నిరవధిక సమ్మె చేయనున్నారని కడం మండల VRA సంఘం అధ్యక్షులు SK ఫేరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు జాడి చంద్ర మౌళి,G. కవిత, ప్రధాన కార్యదర్శి K. శ్రీనివాస్, కోశాధికారి M. రమేష్ మరియు కార్యవర్గ సభ్యులు కొల్లూరి నాగరాజు, B జగన్, జాడి లక్ష్మి,దామెర రాజు పాల్గొన్నారు