రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్…
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 28
తెలంగాణలో టీఎస్ పి ఎస్ సి చైర్మన్, కమిటీ సభ్యులను, వెంటనే తొలగించాలని తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గ్రూప్ వన్ పేపర్ లీకేజీ యువతకు అండగా పార్టీ మండల అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ హాజరై దీక్ష ప్రారంభించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణలో బి ఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించి, టి ఎస్ పి ఎస్ సి కమిటీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు యువతకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల సంపత్. మానకొండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ కుమ్మరి సంపత్, నాయకులు రాజు, సంపత్, ముజ్జు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు అండగా బీఎస్పీ పార్టీ




