Wednesday, 4 November 2026

నిరుద్యోగ యువత తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం

 

 

 

 

 

 

చూడడమే లక్ష్యం – హైదరాబాద్ స్థాయిలో మంథనిలోనే ఉచిత జాబ్ కోచింగ్ అందిస్తున్నాం – ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జనం సాక్షి, మంథని : నిరుద్యోగ యువత తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడమే తన లక్ష్యం అని, అందుకే హైదరాబాద్ స్థాయిలో మంథనిలోనే నిరుద్యోగ యువతకు ఉచిత జాబ్ కోచింగ్ అందిస్తున్నాం అని ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలోని నృసింహ శివ కిరణ్ గార్డెన్ లో మన ఊరు మన కోచింగ్ సెంటర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్స్ 1, 2, 3, 4, ఎస్సై ,కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మైన్స్ ఎగ్జామ్ కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు పీజేఆర్ సౌజన్యంతో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంథనిలోని నృసింహ శివకిరణ్ గార్డెన్ లో ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. కాగా సోమవారం ఉచిత కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు శ్రీధర్ బాబు పలు సలహాలు సూచనలు అందజేశారు. గ్రాండ్ టెస్ట్ , మోడల్ పేపర్స్ శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందజేశారు. హైదరాబాద్ కు పోలేని వాళ్ళు, ఆర్ధిక స్థోమత లేని, సౌకర్యాలు లేని వాళ్ళ కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో 90 శాతానికి పైగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. కొద్ది రోజుల్లో మంథని నియోజకవర్గ ప్రజలకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం చేపడుతామని దీనికి సంబందించిన సాఫ్ట్ వేర్ రెడీ అవుతున్నది అన్నారు. యువత పనికి రాని మాటలు పట్టించు కోకుండా, లక్ష్యం తో ముందుకు వెళ్లాలని సూచించారు . మంథని ప్రాంతం గతంలో మాదిరిగా సరస్వతి నిలయంగా మారాలని అందుకోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.