జుక్కల్, మార్చి 06, (జనం సాక్షి),కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని పాపహరీశ్వరాలయంలో సోమవారం హోళీ పౌర్మిమిని పురస్కరించుకుని స్ధానిక పోలీస్ స్టేషన్ ఎస్సై కోనారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీపాద జోషి అధ్వర్యంలో రుద్రాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతు ప్రజలంతా ప్రశాంత జీవనం గడపాలని, పాడి పంటలతో , ఆయురారోగ్యాలతో విలసిల్లాలని భగవంతుడికి మొక్కుకున్నారు.




