Tuesday, 3 November 2026

నిరుద్యోగ ర్యాలీ ని విజయవంతం చేయాలి

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.నేడు నల్లగొండలో జరిగే నిరుద్యోగ రాలిని విజయవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు గురువారం స్థానిక రాజుభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూరాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు విచ్చేయుచున్నారని,నీళ్లు నియామకాలు నిధుల కొరకు సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కటి నెరవేరకపోగా ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ కనీసంగా ఊరుకొక ఉద్యోగం ఇవ్వక ప్రశ్నాపత్రాలని అమ్ముకొని నిరుద్యోగుల నుండి నోటిఫికేషన్ల పేరుతోటి అప్లికేషన్ రూపేణా కోట్ల రూపాయలు దండుకొని నిరుద్యోగులను నిండా ముంచిన ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ గట్టిగా కొట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలు దీక్షలు చేస్తున్న కారణంగా మన నల్లగొండ జిల్లాలో కూడా భారీ ఎత్తున చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు ఈ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము.తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ పదాన్ని బొంద పెట్టి భారత రాష్ట్ర సమితిగా ఏర్పరచుకొన్న ఈ ఊసరవెల్లి కేసిఆర్ ని గద్ద దించే వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉండి ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరములోని రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కావున రేపు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి బైక్ ర్యాలీ అక్కడి నుండి నల్లగొండ వై జంక్షన్ వరకు చేరుకొని అక్కడినుండి పాదయాత్రగా బయలుదేరి క్లాక్ టవర్ సెంటర్ దగ్గర బహిరంగ సభ ఉన్నది కావున పెద్ద ఎత్తున నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నామన్నారు . ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అజార్ ఉపాధ్యక్షులు సిద్దు నాయక్ మాజీ సర్పంచ్ జంగిలి లింగయ్య పోటేపాక వినయ్, గుడిపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.