హుజూర్ నగర్ మే 9 (జనంసాక్షి): నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి ఉంటుందని హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి అన్నారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని వివిధ వార్డులకు విడుదలైన రూ. 1,94,500 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఏ. నాగలక్ష్మి – రూ. 36,000 (6వ వార్డు ), బి. సైదులు – రూ. 60,000 (25వ వార్డు ), షేక్. రహీమా – రూ. 27,000 (15వ వార్డు ), డి. లక్ష్మీ – రూ. 32,000 (11వ వార్డు ), షేక్. ఖాజాబీ – రూ. 26,000 (15వ వార్డు ), ఆర్. గౌతమ్ – రూ. 13,500 (19వ వార్డు ) లబ్ధిదారులకు
స్థానిక వార్డు కౌన్సిలర్, అధ్యక్షులు పట్టణ బి ఆర్ ఎస్ నాయకుల సమక్షంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో ప్రతి నెల కోట్ల రూపాయలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య స్థితిగతుల కొరకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ప్రజానీకం బి ఆర్ ఎస్ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పై అభిమానాన్ని నింపుకున్నారని తెలియజేశారు. లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ ఇంటి వద్దకే చేరవేయడం చాలా సంతోషంగా ఉందని వారికి సర్వదా కృతజ్ఞులమై ఉంటామని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు, కౌన్సిలర్ లు కె. ఎల్. ఎన్ రావు, జక్కుల శంభయ్య, ములకలపల్లి రామ్ గోపి, అట్లూరి మంజులహరిబాబు, మాజీ వార్డు కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, టిఆర్ఎస్ పట్టణ పార్టీ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, వార్డు ఇంచార్జ్ మీసాల శరత్, అధ్యక్షులు శీలం వీరయ్య, మెరుగ గురవయ్య, పెద్ది పుష్ప, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చింత్రాల నాగయ్య, కోళ్లపూడి దయాకర్, షేక్ రహీం, కొరివి వీరయ్య, వెంకట్రావు, అంజయ్య, సైదులు, ఎల్ల బోయిన పుల్లయ్య, యువజన నాయకులు కోళ్లపూడి చంటి, మామిడి వసంత్, కస్తాల కృష్ణ, మెరుగు సాయి, కస్తాల రామకృష్ణ, షేక్ సయ్యద్, చెడపంగు గోపి, అఖిల్, దగ్గుపాటి రాజేష్, సోమపంగు రవీంద్ర, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.




