Wednesday, 4 November 2026

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న బోస్లే మోహన్ రావు పాటిల్

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ మే 09 జనం సాక్షినిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం తానూర్ మండలం కళ్యాణి గ్రామంలో చేపట్టిన పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కార్యక్రమం లో భాగంగా గడప గడపకు వెళ్లిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ కష్టాలను వారికీ విన్నవించుకోవడం జరిగింది పాటిల్ మాట్లాడుతు మన బిజెపి అధికారం లోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Brs ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను పట్టించుకోవడం లేదు.
ఈ గ్రామ ప్రజలకు సాగు నీరు త్రాగు నీరు అందించని ఈ నిర్లక్ష్య కుటుంబ పాలనను గద్దె దించి బిజెపికి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు.
ఈ గ్రామలలో వైద్య ,విద్యా సదుపాయాలు కూడా లేవని ఈ సారి బిజెపి అధికారంలోకి వస్తే ఈ సమస్యలను తిరుస్తామని హామీ ఇచ్చాడు.