జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని పాలకుర్తి మండలం బామ్ల నాయక్ గ్రామంలో జరిగిన ఇస్లావత్ పాపయ్య సరోజ కళావతి కుమార్తె తేజస్విని పెళ్లికి గ్రామ సర్పంచ్ హాజరై ఆశీర్వదించి 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇలా గ్రామంలో జరిగే పెళ్లిలకు పెద్దన్నల ఆదుకొని ఆర్థిక సహాయం చేస్తున్నందుకు గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సతీమణితో పాటు పెళ్లికూతురు అన్న మధు, వార్డ్ మంబర్ తిరుపతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదల పెళ్లిళ్లకు పెద్దన్నలా ఆదుకుంటున్న సర్పంచ్ రాజు నాయక్




