Thursday, 5 November 2026

అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం .

 

వీణవంక మార్చి 17 (జనం సాక్షి ) వీణవంక మండలంలో గురువారం కురిసిన భారీ వడగళ్ల వర్షానికి నేలకొరిగిన వ్యవసాయ పంటలు అన్నదాతకు తీవ్ర నష్టం జరిగింది వీణవంక మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలు . లక్ష్మక్క పల్లి. నర్సింగాపూర్. వల్బాపూర్ రెడ్డి పల్లి. హిమ్మత్ నగర్. కొండపాక. పోతిరెడ్డిపల్లి. గ్రామాల్లో మొక్కజొన్న. తోపాటు వరి. పత్తి. పంటలు దాదాపు1000 ఎకరాలు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు పంట పరిశీలనకు లక్ష్మక్క పల్లి గ్రామానికి వచ్చిన వ్యవసాయ అధికారి గణేష్ ను రైతులు తమ గోడును వెల్లబుచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తక్షణమే వ్యవసాయ అధికారులను సర్వేకు పంపించి నష్టాన్ని అంచనా వేయించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత మండల రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు. వీణవంక మండల ఉప సర్పంచు ల ఫోరం మండల అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని స్థానిక ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించే విధంగా చూస్తానని వారన్నారు వారి వెంట గ్రామ వ్యవసాయ రైతులు తో పాటు తదితరులు పాల్గొన్నారు