Wednesday, 4 November 2026

నిరుపేద కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండాలి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పిలుపు

భువనగిరి టౌన్ జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పురపాలక సంఘ పరిధిలో 21వ వార్డు ఖాజీ మెహల్లా చెందిన మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు ఎండి, కబీర్ క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది మైనార్టీ జిల్లా కాంగ్రెస్ చైర్మన్ షేక్ మజార్ పాష బబ్లు ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగానే వెనువెంటనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించి నిరుపేద కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండాలని, కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకోవాలని, కార్యకర్త బాగుంటేనే పార్టీ బాగుంటుందని కబీర్ మరణించడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కబీర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది కబీర్ పిల్లలను చదవిపించే బాధ్యత నేనే తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికి 50వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించాలని జిల్లా చైర్మన్ కు అందించడం జరిగింది ఈకార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పంజాల రామాంజనేయులు గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ గోదా శ్రీనివాస్ గౌడ్ ఓబీసీ జిల్లా చైర్మన్ గోదా రాహుల్ గౌడ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి వాకిటి అనంతరెడ్డి జిట్ట మల్లారెడ్డి దాసరి మధు ఉడుత కార్తీక్ తదితరులు పాల్గొనడం జరిగింది