టేకులపల్లి, జూలై 7 (జనం సాక్షి): ఐటీడీఏ ఉపాధ్యాయుల విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూక్య కిషోర్ సింగ్, ఎన్ కృష్ణ లు శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో పాఠశాలల మౌలిక వసతులు కల్పించాలి, ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్స్ చేపట్టాలి, కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు నియామకం కొరకు ప్రత్యేక డీఎస్సీ వేయాలి,ఏజెన్సీ డీఈఓ ను నియమించాలి, కన్వర్టెడ్ ఐన ఆశ్రమ పాఠశాలలకు వెంటనే పోస్టులు మంజూరు చేయాలి గిరిజన విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక రిజల్ట్ ఫండ్ మంజూరు చేయాలి. ఆశ్రమ పాఠశాలకు పర్మనెంట్ వార్డెన్ నియమించాలి,
9 నెలలుగా పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలు విడుదల చేయాలి. మొదలగు డిమాండ్లతో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జూలై 9 ఆదివారం రెడ్డి సత్రం భద్రాచలం లో జరుగుతున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల జిల్లా సదస్సు ను విజయవంతం చేయాలని కోరారు.




