హుజూర్ నగర్ ఫిబ్రవరి 9 (జనంసాక్షి): జన చైతన్య ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు గురువారం ఆర్థిక సాయం అందించారు. జనసేన పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావు విజయలక్ష్మి పెళ్లిరోజు సందర్బంగా జనచైతన్య ట్రస్ట్ నీ సంప్రదించి 50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు జనచైతన్య ట్రస్ట్ కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 13వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నా వడ్లమూడి గురువమ్మా అనే వృద్దురాలికి, 14 వార్డ్ లో నివాసం వుంటున్నా గోవిందు లక్ష్మి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జనచైతన్య ట్రస్ట్ సభ్యులు ఆ కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సరికొప్పుల నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకొని పేద కుంటుంబానికి సాయం చేస్తూ మీ పిల్లల, మీ పుట్టినరోజు, పెళ్లిరోజులను మరో మధుర జ్ఞాపకంగా నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటన్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ల వంశీ, బివి శ్రీపతి, అహ్మద్, పారా సాయి, పిల్లి శివశంకర్, దగ్గుపాటి రమేష్, బాబురావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.




