Wednesday, 4 November 2026

మన ఊరు-మన బడి పనులు పరిశీలన

 

 

 

 

 

 

 

విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన-సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్నడోర్నకల్ ఫిబ్రవరి-8/జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జరిగే పనులను గ్రామ సర్పంచ్ బోయినపల్లి వెంకన్న బుధవారం పర్యవేక్షించి, పిల్లలకు వడ్డించే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సర్పంచ్ విద్యార్థులతో ముచ్చటిస్తూ మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, ప్రసాద్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.