హుజూర్ నగర్ జనవరి 18 (జనంసాక్షి): జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద రెండు వృద్ద కుటుంబాలకు జనచైతన్య ట్రస్ట్ తరుపున ఒక్కోక్కరికి 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 14 వార్డు తిలక్ నగర్ లో పెండ్ర చిన్నాకు రెండు కిడ్నీలు పాడై పోయినాయి. అతని భార్య వెంకటమ్మ కాలు ఇరగటంతో, ఇంకొక వృద్ధ దంపతులు సొంతఇల్లు లేక ఫణిగిరి రామస్వామి గుట్టవద్ద నివాసం ఉంటూ వయసు పైబడి ఇల్లు గడవక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జన చైతన్య ట్రస్ట్ సభ్యులు బుధవారం రెండు కుటుంబాలకు చెరో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. యరగాని మంగమ్మ-గురవయ్య కుమారుడు నరేష్ పుట్టినరోజు సందర్బంగా జనచైతన్య ట్రస్ట్ నీ సంప్రదించి 50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు జన చైతన్య ట్రస్టుకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ల వంశీ, అధ్యక్షులు పారా సాయి, పిల్లి శివశంకర్, దగ్గుపాటి రమేష్, బీవీ శ్రీపతి, బాబురావు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద వృద్ధ కుటుంబాలకు చేయూత




