క్రీడోత్సవాలుచింతపట్ల లో ఘనంగా ముగిసిన సంక్రాంతి క్రీడోత్సవాలు
విజేతలకు బహుమతులు అందజేత
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, జనవరి18(జనంసాక్షి):-యాచారం మండలం చింతపట్ల గ్రామం లో మనఊరు మనబడి ఆధ్వర్యంలో సర్పంచ్ లిక్కి సరిత పాండురంగారెడ్డి సహకారం తో గ్రామ స్థాయిలో గత నాలుగు రోజులుగా జరిగిన సంక్రాంతి సంబరాలు-2023 ముగింపు వేడుకలు మన ఊరు మన బడి స్థాపకులు&స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మహ్మద్ సాబెర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ముగింపు కార్యక్రమం లో గ్రామ ప్రజలు,మహిళలు,యువతి, యువకులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సంక్రాతి సందర్బంగా గ్రామం లో యువకులకు క్రికెట్,వాలీబాల్ పోటీలు.మహిళలకు వాలీబాల్, ముగ్గుల పోటీలు,టెన్నికాయిట్ మరియు స్కూల్ విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది.గెలిచిన జట్లకు బహుమతులతో పాటుగా క్యాష్ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కయితీ వెంకటరెడ్డి గ్రామస్తులు పెండ్యాల వెంకటేష్, వస్పరి శ్రీనివాస్,గుండ్ల శేఖర్ , ఇబ్రహీం, వెంకటేష్ , శేఖర్ , నర్సిరెడ్డి , శ్రీను , నరేష్, యాదగిరి,మహేష్, జహంగీర్, శ్రీను, శివ, కన్న,మన ఊరు మన బడి స్థాపకులు మహ్మద్ సాబెర్ తదితరులు పాల్గొన్నారు..
చింతపట్ల లో ఘనంగా ముగిసిన సంక్రాంతి




