Tuesday, 3 November 2026

నిర్మల్ పట్టణంలో పర్యటించిన మంత్రి, అల్లోల జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ బ్యూరో, జులై14,,జనంసాక్షి,,,    నిర్మల్ పట్టణంలో ని రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ఇబ్రహీం చెరువు ను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. చెరువు పూర్తిగా నిండి అలుగు ద్వారా నీటిని తొలగిస్తున్న చర్యలను దగ్గరుండి పరిశీలించారు.
అనంతరం GNR కాలనీ ని మంత్రి, కలెక్టర్ సందర్శించారు. కాలనీ మొత్తం పర్యటించి పరిస్థితి ని సమీక్షించారు. వర్షాభావం తగ్గుముఖం పట్టిందని  ఇండ్లు మునిగి పోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రజలను ముందే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు.
కాలనీ వాసులతో మంత్రి మాట్లాడగా వారు గత సంవత్సరం వర్షాల వల్ల మీరు తీసుకున్న చర్యలకు ఈ సారి వర్షాలు తీవ్రంగా ఉన్నప్పటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు మంత్రికి వివరించారు.అనంతరం మంజులాపూర్,జహరా నగర్,కాలనీల్లో సందర్శించి  బాధితులకు భరోసా కల్పించారు.మంజులపూర్ చెరువు పూర్తి గా నిండుకుండలా నిండడం తో నీరంతా లోతట్టు ప్రాంతాలకు చేరడంతో మురికాలువలు,సిసి రోడ్లు పూర్తిగా దెబ్బన్తిన్నాయని వాటిని మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులు కు ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ,మున్సిపల్  చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,అల్లోల సురేందర్ రెడ్డి, మాజీ డిసిసిబి రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు కొండ సబితా శ్రీధర్,  అన్వర్, నామేడ రమ్య విజయ్,గండ్రత్ రమణ నాయకులు గజేందర్, కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.