నిర్మల్ బ్యూరో, జూన్ 2:జనంసాక్షి,,, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. శుక్రవారం నిర్మల్ జిల్లాకేంద్రంలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్, మిని ట్యాంక్ బండ్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్ లో పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు రాంకిషన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కొరిపెళ్లి విజయలక్ష్మి, నాయకులు మురళీధర్ రెడ్డి,గౌతమ్ రెడ్డి,సురేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి




