బెల్లంపల్లి, జూన్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట్, నెన్నెల, బిమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జై తెలంగాణ నినాదాలతో నియోజకవర్గం మారుమోగి పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలతో అమరులైన వారిని స్మరించుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఆర్డివో కార్యాలయంలో ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ మధుసూదన్, జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, వైస్ ఎంపీపీ రాణి సురేష్, ఎంపీడీఓ రాజేందర్, మెడికల్ ఆఫీసర్ అనీష్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.




