Wednesday, 4 November 2026

నివాళులర్పించిన ఎమ్మెల్యే

నివాళులర్పించిన ఎమ్మెల్యే
అల్లాదుర్గం జనంసాక్షి నవంబర్ 24
అల్లాదుర్గం మండలపరిదిలోని బహిరన్ దిబ్బ గ్రామ పంచాయతీ ఒకటవ వార్డు సభ్యుడు ముప్పారం యాదయ్య (26) అనారోగ్యంతో బాధపడుతు బుధవారం తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గురువారం బహిరన్ దిబ్బ లోని వారి నివాసానికి వెళ్లి యాదయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యం కల్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఆయన వెంట మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు పళ్ళెగడ్డ నర్సింలు ,తెరాస నాయకులు కోర్మని ప్రభు ,లేకి రమేష్ ,వీరప్ప ,ఉపసర్పంచ్ నర్సప్ప తదితరులు న్నారు