Wednesday, 4 November 2026

మున్నూరు కాపు వన భోజన విజయోత్సవ సమావేశంమున్నూరు కాపు వన భోజన విజయోత్సవ సమావేశం

మున్నూరు కాపు వన భోజన విజయోత్సవ సమావేశంమున్నూరు కాపు వన భోజన విజయోత్సవ సమావేశం
వరంగల్ ఈస్ట్, నవంబర్ 24(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ రోటరీ క్లబ్ లో గురువారం సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గం మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన మున్నూరు కాపు వనభోజన విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా పట్టుదలతో వనభోజనాలను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్భంగా పలువురు డివిజన్ మున్నూరు కాపు అధ్యక్షులు కార్యవర్గం మున్నూరు కాపు వనభోజనాన్ని నిర్వహించి విజయవంతం చేయడం పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించారు మొట్టమొదటిసారిగా వనభోజనాలను నిర్వహించి మున్నూరు కాపుల ఐక్యతను చాటినందుకు ఈ సందర్భంగా నిర్వాహకులను పలువురు అభినందించారు. మున్నూరు కాపు మొన్న భోజనాలకు వచ్చిన కాపు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో మున్నూరు కాపు పెద్దలు కేడాల జనార్ధన్, పెంచాల గోపన్న, మేడిది మధుసూదన్, ఓగిలి శెట్టి అనిల్ కుమార్, ముష్క మల్ల సుధాకర్, బండి జనార్ధన్, కత్తెరసాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు