Wednesday, 4 November 2026

నీటి వనరుల్లో జిల్లాకే తొలి ప్రాధాన్య ఇవ్వాలి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): జిల్లాలో లభిస్తలున్న నీటి వనరులను ముందుగా జిల్లాకు మాత్రమే కేటాయించాలని జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్‌ అన్నారు. ఈ విషయంలో ముందు జిల్లా అవసరాలు తీరిని తరవాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ముందుగా జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ చేయాలన్నారు. ఇదిలావుంటే రైతులు కూడా తమ అవసరాల మేరకు పంటల సాగును చేపట్టాలన్నారు. వాణిజ్య పంటల మోజులో తిండి గింజల సేద్యాన్ని విస్మరించేలా పారిశ్రామిక వేత్తలు, పాలకులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా పంటల సాగును విడనాడాలన్నారు. కల్తీ విత్తనాలకు దూరంగా ఉండి సేంద్రియ ఎరువులతో తిండి గింజలను పండించుకుని వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. సహజ వనరుల విధ్వంసాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న దోపిడి, సంక్షభాన్ని పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొరావల్సి ఉందన్నారు. ఇదిలావుంటే తెలంగాణ తిండినిచ్చే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీల దోపిడి నుంచి రక్షించాలని ఆదివాసీ ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది.  ఉట్నూరు మండలం మత్తడిగూడలో తెలంగాణ ఆహార సార్వభౌమత్వ సమ్మేళనం కార్యక్రమంలో పంటల దోపిడీలో రైతులు ఎలాచిక్కున్నదీ వివరించారు. దేశ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 60శాతం ఆహారేతర పంటలను పండిస్తున్నారన్నారు. 40శాతం మాత్రమే ఆహారధాన్యాలను పండిస్తున్నారన్నారు. అయితే కార్పోరేట్‌ పారిశ్రామికవేత్తలు తమ లాభాల కోసం వాణిజ్య పంటలను ప్రతో/-సహిస్తున్నారని వక్తులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *