Wednesday, 4 November 2026

తొలకరి మొదలవ్వగానే హరితహారం పనులు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తొలకరి మొదలవ్వగానే జిల్లాలో హరితహారం మొదలవుతుందని, లక్ష్యం మేరకు మొక్కలు నాటుతామని కలెక్టర్‌ జగన్మోహన్‌ ప్రకటించారు. రహదారులకు ఇరువైపులా పచ్చనదనం పెంచేలా కృషి చేస్తమన్నారు. ఇందులో భాగంగా  10 నియోజకవర్గాల్లో 4 కోట్ల మొక్కలను రైతులకు, ప్రజలకు పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 130 నర్సరీలలో పండ్లు, పూల మొక్కల పెంపకం జరుగుతుందన్నారు. వర్షాలు కురిసిన వెంటనే ప్రజలకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు అందిస్తామన్నారు. వెంటనే నర్సరీలో మొక్కల పెంపకం బాగా జరపాలని అధికారులకు సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకం జరుగుతన్న తీరుపై ఆయన  అటవీశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్‌ మండలంలోని దంతనపల్లి సామాజిక అటవీశాఖ నర్సరీని  సందర్శించి అక్కడ పనులను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీలో పెంచుతున్న మొక్కల తీరును చూసి తప్పుడు సమాచారం అందిస్తే చర్యలు తప్పవని సంబంధిత శాఖాధికారులను హెచ్చరించారు.  మొక్కలు ఉన్న వాటిలో గడ్డి అధికంగా ఉందని ఇలా ఉంటే వూరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొక్కల మధ్యల్లో ఉన్న కలుపును తీయించాలని సూచించారు.  ప్రజల అవసరం మేరకు పండ్లు, ఇతర మొక్కలను అందించాలని, ఎవరెవరికి ఇచ్చిన విషయాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలని, మొక్క ప్రాముఖ్యతను ప్రజలను తెలియజేయాలన్నారు. ఎండాకాలం కావడంతో మొక్కలకు ప్రతి రోజు నీరు అందిస్తూ రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. వాటర్‌షెడ్‌ పథకంలో ఏర్పాటు చేసే మొక్కలను హరితహారం నర్సరీల నుండి పంపిణీ చేయాలన్నారు. వన్యప్రాణుల కోసం నిర్మించిన చెరువును పరిశీలించి ఎండాకాలంలో వన్యప్రాణులకు తాగునీరు లభించేలా సౌరశక్తితో నీటి పంపుణు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *