నీట మునిగిన సంతోషిమాత కాలనీ

వరంగల్ ఈస్ట్, జూలై 27 (జనం సాక్షి):వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ సంతోషిమాత కాలనీ లో నీరు పూర్తిగా నిలిచిపోయి గృహ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో వారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇండ్లలోకి నీరు చేరి వస్తువులు బట్టలు ఆహార పదార్థాలు పూర్తిగా తడిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ పట్ల సహాయక చర్యలు తీసుకోవడంలో ఎవరు ముందుకు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని తమకు శాశ్వత పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను ప్రజాప్రతినిధులను గృహవాసులు కోరుతున్నారు. ముఖ్యంగా 12- 8- 222/1 గృహాల ప్రాంతంలో పూర్తిగా జలమయమై గృహవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు గృహవాసులను రక్షించి వారికి తగిన సహాయం చేయాలని కోరుతున్నారు.

తాజావార్తలు