Wednesday, 4 November 2026

నీల్వాయిలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

వేమనపల్లి,జూలై 08,(జనంసాక్షి):

వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో అవని పిల్లల హాస్పిటల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో నవజాత శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అత్యవసర వైద్య సేవలను ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ రుద్రభట్ల రఘువంశీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు