పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వేమనపల్లి,జులై 08,(జనంసాక్షి):

బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 325 మంది లబ్ధిదారులకు 733.04 ఎకరాల పోడు పట్టాలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు.పట్టాలు పంపిణీ చేసే సమయంలో విద్యుత్ అంతరాయంతోపాటు మైకులు మొరాయించడంతో ఎంపీడీవోపై అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల చరిత్రలో పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు ఏర్పాటుచేసిన పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటివరకు గత ప్రభుత్వాలు మూడు లక్షల ఎకరాలకు పట్టాల పంపిణీ చేస్తే సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పరిపాలనలోనే ఒకే రోజు నాలుగు లక్షల 60 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారని అన్నారు.కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం పనిచేసే గొప్ప నాయకుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య, తహసిల్దార్ రాజకుమార్,ఎంపీపీ, వైస్ ఎంపీపీ,పలు గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు,అధికారులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు