జనంసాక్షి (జులై 15) : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకల మధ్య ఎక్కడో గోదావరి నుండి రావాల్సిన నీళ్ల పైపులు మరమ్మతులకు గురవ్వడం, విద్యుత్ సమస్యలు ఏర్పడటం వల్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నమాట సరే మరి ప్రత్యామ్నాయ అవకాశమున్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం ఏంటని పంచాయితీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా నీటి సరఫరా లేకున్నా చూస్తూ ఉండిపోతున్నారు తప్ప పంచాయతీల్లో ఉన్న మోటార్ ల ద్వారా నీటి సేకరణ చేసి ప్రజలు పడే ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చెయ్యడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నెల రోజుల పాటు పంపులు రాక పోయినా చూస్తూ ఉంటారే తప్ప ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కాని పారేసినట్టుగా వ్యవహరించే తీరుపై మండి పడుతున్నారు. పంచాయతీల్లో ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కనీసం అధికారులు ప్రజా ప్రతినిధుల్లో సంచలనం కరువైందని విమర్శలు వినిపిస్తున్నాయి.తక్షణం స్థానికంగా ఉన్న మోటార్ల ను పునరుద్ధరించి నీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.




