Wednesday, 4 November 2026

నూతన ఎక్సైజ్‌ పాలసీపై రాష్ట్రవ్యాప్త ఆందోళన: ఐద్వా

బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్‌): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే పూర్తిగా మద్యాన్ని నియంత్రించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. జులై ఒకటి నుంచి అమలు కానున్న నూతన ఎక్సైజ్‌ పాలసీని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతి, స్వరూపరాణి మాట్లాడుతూ…. మద్యం షాపుల వద్ద సిట్టింగ్‌లకు పర్మిట్లు ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *