Wednesday, 4 November 2026

ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి: ఏకే ఖాన్‌

బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్‌): ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాటలో నడిపించేందుకు నిర్మాణాత్మకమైన కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది కుటుంబ సంరక్షణనిధి సర్వసభ్య సమావేశం కార్యదర్శి డి. అనందం అధ్యక్షతన మంగళవారం సుందరయ్య కళానిలయం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏకే ఖాన్‌ మాట్లాడుతూ… సంస్థలోని కొన్ని విభాగాల్లో గతేడాది కంటే ఈ ఏడాది రూ. 2.5కోట్ల నష్టాన్ని నివారించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఆర్టీసీని నష్టరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈసమావేశంలో సంరక్షణ నిధి వైస్‌ఛైర్మన్‌ ఏవీరావు, కార్యవర్గ సభ్యులు వేణు, మల్లిఖార్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *