Wednesday, 4 November 2026

నూతన భవనంలోకి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు

 

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి): హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రస్తుతం పనిచేస్తున్న భవనం నుంచి బార్ అసోసియేషన్ పాత హాలు లోనికి శుక్రవారం మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించి మార్చారు. కోర్టు హాలును జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర రిబన్ కట్ చేసి ప్రారంభించగా, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఛాంబర్ ను సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ఇటీవల హుజూర్ నగర్ కు జిల్లా న్యాయస్థానం మంజూరి అయినందున దాని ఏర్పాటు కొరకు ప్రస్తుత జూనియర్ సివిల్ జడ్జి హాలును జిల్లా కోర్టుకి కేటాయించి, పాత బార్ అసోసియేషన్ హాలు లోనికి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును జిల్లా, హైకోర్టుల న్యాయమూర్తుల ఆదేశాల మేరకు మార్చామన్నారు. ఇకనుండి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యకలాపాలు ఈ హాల్లోనే నిర్వహిస్తారని న్యాయవాదులు కక్షిదారులకు విషయాన్ని తెలియజేసి ఇక్కడ హాజరు కావడానికి సహకరించవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి, న్యాయవాదులు అంబటి శ్రీనివాసరెడ్డి, కాల్వ శ్రీనివాసరావు, ఏజిపి విజికే మూర్తి, యాదగిరి, ప్రవీణు, రమణారెడ్డి, అంజయ్య, కుక్కడపు సైదులు, మీసాల అంజయ్య, గొట్టే ప్రశాంత్, చక్రాల వెంకటేశ్వర్లు, రామినేని వెంకటేశ్వర్లు, మునగపాటి గోపీనాథ్, శ్రీను నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, సురేష్ నాయక్, జక్కుల వీరయ్య, పాలేటి శ్రీనివాసరావు, చల్లా కృష్ణయ్య, కమతం నాగార్జున, పాలేటి శ్రీనివాసరావు, గొల్ల గోపు నవీన్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సూపరింటెండెంట్ లు తాటి విజయభాస్కర్ రెడ్డి, పానుగోతు సైదా నాయక్, కోర్టు సిబ్బంది, వివిధ పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుల్ లు తదితరులు పాల్గొన్నారు.