Tuesday, 3 November 2026

నూతన సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

 

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 28,(జనంసాక్షి):వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో  కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ నుండి మంజూరైన  16 లక్లల వ్యయంతో  హెల్త్ సబ్ సెంటర్ (పల్లె దవాఖాన) భవన నిర్మాణ పనులను నీల్వాయి ఎంపిటిసి ఆర్ సంతోష్ కుమార్,సర్పంచ్ గాలి మధు,డిఈ శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి రాజేష్,నీల్వాయి ఉపసర్పంచ్ నాఫీజా బేగం,వార్డు సభ్యులు మహేందర్, రాంరెడ్డి,సక్కుబాయి,ఈర్ల అరుణ,పూర్ణచందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ చెన్నురి చెందు,మాజి వైస్ ఎంపీపీ ఒడిల రాజన్న,హెల్త్ సూపర్ వేజర్ సరోజన,ఏఎన్ఎంలు తిరుపతమ్మ,కళావతి,ఏఈ రాజేశ్వర్ రెడ్డి,ఆశా వర్కర్లు,గ్రామస్తులు పాల్గోన్నారు.