Tuesday, 3 November 2026

అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

 

 

 

 

 

 

అలంపూర్ ఏప్రిల్ 28 (జనం సాక్షి ) అనారోగ్యంతో బాధపడుతున్న అభాగ్యులకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం సహాయ నీది ద్వారా పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, శాసనసభ్యులు డాక్టర్ వి ఎం అబ్రహం అన్నారు.
అలంపూర్ మండలం లోని లింగనువాయి గ్రామ సర్పంచ్ మనోజ్ కుమార్ రెడ్డి గతం లో అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతు మరణించడం జరిగింది. చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ద్వారా సీఎం సహాయని నిది కి ధరకాస్తు చేసుకోగా వారికి 3 లక్షల రూపాయలు సీఎం సహాయ నీది ద్వార మంజూరు చేసారు. మంజూరు అయిన చెక్కును ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం నేరుగా వారి ఇంటికి వెళ్లి బార్య సుభద్రమ్మ కి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి సుభద్రమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు, శాలువ పులా మాలతో సత్కరించారు
ఈ సందర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ,పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నీది చెక్కులను పంపిణీ చేస్తున్నామని, సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, సినియర్ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు