హైదరాబాద్: ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 10కె రన్ ఫౌండేషన్ అధ్వర్యంలో నెక్లెన్‌రోడ్డులో 5 కె మహిళ రన్ నిర్వహించారు. పీపుల్స్‌ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ పరుగును పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్, సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ప్రారంభించారు. ఈ పరుగులో మహిళలు ఉత్సహంగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.




